logo

రవుర్కెలా బరిలో కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌రే

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త దిలీప్‌రే రవుర్కెలా అసెంబ్లీ భాజపా అభ్యర్థి అయ్యారు. నయాగఢ్‌ జిల్లా రణపూర్‌ స్థానానికి గతంలో తాపస్‌ ముర్ధాను అభ్యర్థిగా చేసిన భాజపా నాయకత్వం ఆయనను తప్పించి మాజీ మంత్రి సురమా పాఢిని నిలబెట్టింది.

Published : 17 Apr 2024 05:39 IST

21 మందితో భాజపా రెండో జాబితా  

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త దిలీప్‌రే రవుర్కెలా అసెంబ్లీ భాజపా అభ్యర్థి అయ్యారు. నయాగఢ్‌ జిల్లా రణపూర్‌ స్థానానికి గతంలో తాపస్‌ ముర్ధాను అభ్యర్థిగా చేసిన భాజపా నాయకత్వం ఆయనను తప్పించి మాజీ మంత్రి సురమా పాఢిని నిలబెట్టింది. మంగళవారం ఆ పార్టీ 21 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. పొట్టంగిలో ఇదివరకు చైతన్య హంతాల్‌ను ప్రకటించారు. ఆయనను పక్కన పెట్టి చైతన్య నందిబలీని నిలబెట్టింది.

అభ్యర్థులు వీరు

దిలీప్‌రే (రవుర్కెలా), అఖిల్‌ చంద్రనాయక్‌ (పాట్నా), బాదవ్‌ హంసదా (సరసకొణా), జలెన్‌ బారదా (రాయ్‌రంగపూర్‌), సంచిలి ముర్ము (బంగిరిపోషి) పద్రచరణ హైబ్రు (కరంజియా), నరసింహ భత్రా (ఝురిగాం), సోమనాథ్‌ పూజారి (డాబుగాం), లలిత్‌ బెహరా (రాజనగర్‌), సత్యసారథి మహంతి (బలికుద - ఎరసమ), అమరేంద్రదాస్‌ (జగత్సింగ్‌పూర్‌), బయిధర్‌ మల్లిక్‌ (కాకట్‌పూర్‌), సురమా పాఢి (రణపూర్‌), ఉత్తంకుమార్‌ పాణిగ్రహి (సన్నోఖెముండి), ప్రశాంత మల్లిక్‌ (మోహనా), జగన్నాథ నుండుక (బిసంకటక్‌), బసంతకుమార్‌ ఉలక (రాయగడ), కైలాస కులేసిక (లక్ష్మీపూర్‌), రుపు భత్రా (కొట్పాడ్‌), చైతన్య నందబలీ (పొట్టంగి), డొంబురు సిసా (చిత్రకొండ)లు.

ప్రకటించాల్సిన స్థానాలు 16

రెండు విడతల్లో భాజపా ఇంతవరకు 21 లోక్‌సభ, 131 అసెంబ్లీ స్థానాల జాబితా విడుదల చేసింది. మరో 16 శాసనసభ సీట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.


అన్యాయంగా బహిష్కరించారు: సురేష్‌


భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: గత అయిదున్నర దశాబ్దాలుగా రాష్ట్ర కాంగ్రెస్‌కు విశిష్ట సేవలందించిన తనను అన్యాయంగా పార్టీ నుంచి బహిష్కరించారని, దీనిపై తాను ఏఐసీసీ నాయకత్వానికి మంగళవారం లేఖ రాశానని సురేష్‌ రౌత్రాయి చెప్పారు. భువనేశ్వర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తన కుమారుడు మన్మధ రౌత్రాయి భువనేశ్వర్‌ లోక్‌సభ స్థానానికి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడని, ప్రచారంలో పాల్గొంటున్నానని, తనకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లబోనని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని