logo

అందరి సహకారంతో జాతర్లు

పార్వతీపురంలో 29 నుంచి 31 వరకు జరగనున్న ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ బంగారమ్మ జాతర్లకు సుమారు అయిదు లక్షల మంది భక్తులు వచ్చే వీలుందని, ప్రజల సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఇప్పలపోలమ్మ ఆలయ కమిటీ సభ్యులు బి.జయబాబు,

Published : 28 May 2023 02:29 IST

5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం

కరపత్రాలు విడుదల చేస్తున్న కమిటీ సభ్యులు

పార్వతీపురం పట్టణం, పురపాలక, న్యూస్‌టుడే: పార్వతీపురంలో 29 నుంచి 31 వరకు జరగనున్న ఇప్పలపోలమ్మ, ఎర్రకంచెమ్మ బంగారమ్మ జాతర్లకు సుమారు అయిదు లక్షల మంది భక్తులు వచ్చే వీలుందని, ప్రజల సహకారంతో భారీ ఏర్పాట్లు చేసినట్లు ఇప్పలపోలమ్మ ఆలయ కమిటీ సభ్యులు బి.జయబాబు, బి.సీతారాం తెలిపారు. శనివారం జాతర కరపత్రాలు విడుదల చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పట్టణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించామన్నారు. మంగళవారం సిరిమానోత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే జోగారావు విరాళంగా ప్రకటించిన రూ.లక్షను ఫ్లోర్‌ లీడర్‌ ఎం.రవికుమార్‌ కమిటీ సభ్యులకు అందజేశారు.

తాగునీటి సమస్య రానీయొద్దు

పార్వతీపురం, న్యూస్‌టుడే: జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో హేమలత ఆదేశించారు. శనివారం పోలీసు, రెవెన్యూ, పురపాలక, దేవదాయ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. పట్టణంలో నీటి సమస్య తలెత్తకుండా ట్యాంకర్లతో అందించాలని, గ్రామీణ నీటి సరఫరా విభాగం నుంచి పురపాలికకు అదనంగా మూడు ట్యాంకర్లు అందజేయాలన్నారు. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తుకు అదనంగా సిబ్బందిని రప్పిస్తున్నట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ప్రధాన కూడళ్లలో వైద్య శిబిరాలు, 108, 104 వాహనాలు అందుబాటులో ఉంటాయన్నారు. కమిషనరు రామప్పలనాయుడు, తహసీల్దారు శివన్నారాయణ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు