logo

150 పడకలు.. 297 మంది రోగులు!

ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి... మరో వైపు ఉక్కపోత. ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. ప్రస్తుతం జ్వరాలు, వడదెబ్బ లక్షణాలతో బాధపడుతున్న వారు ఎక్కువగా జిల్లా ఆసుపత్రికి వస్తున్నారు.

Published : 01 Jun 2023 04:34 IST

ఎంఎం వార్డులో ఒక్కో మంచంపై ఇద్దరికి చికిత్స

వైపు ఎండలు మండిపోతున్నాయి... మరో వైపు ఉక్కపోత. ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడుతోంది. ప్రస్తుతం జ్వరాలు, వడదెబ్బ లక్షణాలతో బాధపడుతున్న వారు ఎక్కువగా జిల్లా ఆసుపత్రికి వస్తున్నారు. ఇంకో వైపు ప్రసవాలు ఎక్కువగా జరుగుతుండటంతో కిటకిటలాడుతోంది. బుధవారం నాటికి 150 పడకల ఆసుపత్రిలో 297 మంది ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. మగవారి వార్డు (ఎంఎం)లో 45 పడకలకు 54 మంది ఉన్నారు. ఒక్కో మంచంపై ఇద్దరు చొప్పున చికిత్స పొందుతున్నారు. ఎక్కువగా వడదెబ్బ, జ్వరాల కేసులు వస్తున్నాయని, రద్దీ ఎక్కువ కావడంతో మంచాలను సర్దుబాటు చేసి చికిత్స అందిస్తున్నామని సూపరింటెండెంటు వాగ్దేవి తెలిపారు.

న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు