logo

జోగారావుకు స్వగ్రామంలో ఝలక్‌

పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నియంత పోకడలను తట్టుకోలేక స్వగ్రామం బలిజిపేట మండలంలోని చిలకలపల్లి నాయకులు వైకాపా నుంచి బయటకు వచ్చారు.

Published : 16 Apr 2024 05:30 IST

చిలకలపల్లిలో తెదేపా తీర్థం పుచ్చుకున్న వైకాపా నాయకులు  

విజయచంద్రతో కలిసి నినాదాలు చేస్తున్న చిలకలపల్లి గ్రామస్థులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నియంత పోకడలను తట్టుకోలేక స్వగ్రామం బలిజిపేట మండలంలోని చిలకలపల్లి నాయకులు వైకాపా నుంచి బయటకు వచ్చారు. జోగారావు ఎమ్మెల్యే అయ్యాక కుటుంబ సభ్యులకే పదవులు కట్టబెట్టి ఒంటెద్దుపోకడలకు పాల్పడ్డారని, మీతో మేము ఉండలేమంటూ చిలకలపల్లికి చెందిన 150 కుటుంబాల్లోని వందల మంది వైకాపా వీడి కూటమి అభ్యర్థి విజయచంద్ర సమక్షంలో పార్వతీపురం కార్యాలయంలో పసుపు కండువాలు కప్పుకొన్నారు. ఇన్నాళ్లు నిర్బంధంలో ఉన్న తాము సంకెళ్లు తెంచుకొన్మానని వైకాపా నుంచి వచ్చిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు రంగుముద్రి సంజీవరావు పేర్కొన్నారు. తెదేపాలో చేరిన వారిలో ఆర్‌.జగన్నాథం, ఆర్‌.రాంబాబు, ఆర్‌.రామదాసు, ఆర్‌.ఉమామహేశ్వరరావు, ఎస్‌.శంకరరావు, ఎ.అప్పలస్వామి, ఎ.వెంకటస్వామి, బి.సాంబయ్య, ఎ.మధు, డి.ప్రసాద్‌, ఎ.చిట్టిబాబు, ఎం.సింహాచలం, టి.వెంకటరమణ, ఎ.ప్రసాద్‌, వి.కాశీవిశ్వనాథ్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని