logo

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం: శ్రీభరత్‌

యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు.

Published : 18 Apr 2024 04:42 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌ అన్నారు. ఎంవీపీకాలనీలోని పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం జనసేన ప్రైవేటు ఎంప్లాయిస్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విశాఖకు వచ్చిన పలు ప్రైవేటు కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషిచేస్తామన్నారు. గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం విశాఖలో దోపిడీ చేసిందన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు