logo

కూటమితోనే రాష్ట్రాభివృద్ధి

పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

Published : 24 Apr 2024 04:37 IST

రేగిడి, వంగర, న్యూస్‌టుడే: పుర్లి, దేవుదళ తదితర గ్రామాల్లో నియోజకవర్గ కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ ప్రచారం నిర్వహించారు. కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎర్నేన రామినాయుడు, కె.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఖండ్యాం ఎంపీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసరావు సతీమణి అనూరాధ తెదేపాలో చేరారు. అనుచరులతో కలిసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కోండ్రు వీరికి కండువాలు వేసి, పార్టీలోకి ఆహ్వానించారు.  


‘మాయదారి ప్రభుత్వం మనకొద్దు’

చీపురుపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఒక చేత్తో బటన్‌ నొక్కి రూ.పది ఇచ్చి.. మరో చేత్తో రూ.వంద లాగేస్తోందని కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకటరావు అన్నారు. తెదేపా నియోజకవర్గ బీసీ విభాగం అధ్యక్షుడు ముల్లు రమణ, కుమరాం సర్పంచి రమాదేవి ఆధ్వర్యంలో వారి నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు వైకాపాను వీడి తెదేపాలో చేరగా, కళా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కిమిడి రామ్‌మల్లిక్‌  నాయుడు, కామునాయుడు, పైల బలరాం, దన్నాన రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

 ‘ప్రజాగళం’ను జయప్రదం చేయాలి

చీపురుపల్లి, న్యూస్‌టుడే: నెల్లిమర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో ఈనెల 24న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొనే ‘ప్రజాగళం’ బహిరంగ సభలకు విజయవంతం చేయాలని తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు