logo

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు

గణతంత్ర వేడుకలను ఈ నెల 26న సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో సోమవారం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు

Published : 18 Jan 2022 02:39 IST


సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు 

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: గణతంత్ర వేడుకలను ఈ నెల 26న సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్‌లో సోమవారం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, అగ్నిమాపక విభాగాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జేసీ చేతన్, డీఆర్వో పి.శ్రీనివాసులు, బీసీ కార్పొరేషన్‌ ఈడీ వెంకటేశ్వరరావు, డీపీవో నారాయణరెడ్డి, డ్వామా పీడీ కె.శీనారెడ్డి, డీఆర్డీఏ పీడీ బాబూరావు, పశుసంవర్ధకశాఖ జేడీ బేబిరాణి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మర్దన్‌అలీ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని