logo

ప్రతి పౌరుడికి హెల్త్‌ ఐడీ

జిల్లాలో ప్రతి పౌరుడికి హెల్త్‌ ఐడీ ఉండేలా చర్యలు తీసుకుంటామని నూతన డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రోగ్రాం అధికారులు, కార్యాలయ సిబ్బంది, వైద్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు

Published : 26 May 2022 06:47 IST


డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ప్రోగ్రాం అధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రతి పౌరుడికి హెల్త్‌ ఐడీ ఉండేలా చర్యలు తీసుకుంటామని నూతన డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రోగ్రాం అధికారులు, కార్యాలయ సిబ్బంది, వైద్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌ ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోగా వ్యవహరించారు. నూతన డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆసుపత్రులకు వచ్చేవారికి అక్కడికక్కడే ఐడీ నంబర్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎప్పుడు ఏ ఆసుపత్రికి వెళ్లినా ఆ నంబర్‌ ఆధారంగా సదరు వ్యక్తి ఆరోగ్య సమాచారం పూర్తిగా తెలుసుకోవచ్చన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వయసు, ఎత్తు, బరువు, బీపీ, షుగర్‌, ఏవైనా శస్త్రచికిత్సలు జరిగాయా వంటి సమాచారం సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారన్నారు. దీనివల్ల వైద్యులు సకాలంలో మెరుగైన చికిత్స అందించేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతం 65 శాతం మందికి ఐడీ నంబర్లు ఇచ్చారని... త్వరలోనే మిగతా ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుపై దృష్టి పెడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని