logo

మానేయొద్దు.. బడికి రండి

జిల్లాలో అర్ధంతరంగా బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ రప్పించే ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 13,580 బడి మానేయగా  ఆదివారం నాటికి 4,747 మంది ఆచూకీ తెలుసుకొని విద్యాశాఖ సిబ్బంది వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.

Published : 03 Oct 2022 02:21 IST

4,747 మందిని తిరిగి చేర్చిన అధికారులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే:

జిల్లాలో అర్ధంతరంగా బడి మానేసిన పిల్లలను గుర్తించి మళ్లీ రప్పించే ప్రక్రియలో తొలి ఘట్టం పూర్తయింది. మొత్తం 13,580 బడి మానేయగా  ఆదివారం నాటికి 4,747 మంది ఆచూకీ తెలుసుకొని విద్యాశాఖ సిబ్బంది వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. దసరా సెలవుల అనంతరం బడికి వచ్చేలా ఒప్పించారు. అదే విధంగా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చి ఆయా విద్యార్థుల పేర్లు కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి విద్యార్థి వాస్తవ సమాచారం సేకరించాలని ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు డీఈవో బి.విజయభాస్కర్‌ మండలస్థాయి సిబ్బందికి సూచనలిచ్చారు. డ్రాపవుట్‌ అయిన ప్రతి విద్యార్థి ఎక్కడో ఒకచోట చదవడమే లక్ష్యమని పేర్కొన్నారు.

సచివాలయ సిబ్బంది సాయంతో

అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి పదోతరగతి లోపు విద్యార్థులు మొత్తం 3,31,754 మంది ఉన్నారు. వారిలో 28,140 మంది ఈ ఏడాది కొత్తగా బడిలో చేరినవారే. ఇందులో సక్రమంగా బడికి రానందున హెచ్‌ఎంలు తొలగించిన పేర్లు 3235 ఉన్నాయి. మరో 10,345 మంది ఎక్కడున్నారో గుర్తించాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. సచివాలయ సిబ్బందిని కూడా భాగస్వాములను చేసేందుకు సోమవారం వారితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని