logo

ఆట విభిన్నం.. ప్రతిభ అమోఘం

వారంతా విభిన్న ప్రతిభావంతులు. అయితేనేం ఆటల్లో ఇతరులకు తామేమీ తీసిపోమని నిరూపించారు. ఉత్సాహంగా పరుగులు తీశారు..

Published : 30 Nov 2022 02:07 IST

పరుగు పందెంలో పాల్గొన్న క్రీడాకారులు

వారంతా విభిన్న ప్రతిభావంతులు. అయితేనేం ఆటల్లో ఇతరులకు తామేమీ తీసిపోమని నిరూపించారు. ఉత్సాహంగా పరుగులు తీశారు.. బ్యాట్‌ పట్టి.. బంతి విసిరి క్రికెట్‌ ఆడారు.. వాలీబాల్‌, త్రోబాల్‌, షాట్‌ఫుట్‌లోనూ వారెవ్వా అనిపించారు.. చదరంగంలో ఎత్తులు, పైఎత్తులతో తమ తెలివితేటలు అమోఘం అనిపించారు. ఇవీ ఒంగోలు నగరం సంతపేటలోని డీఆర్‌ఆర్‌ఎం ఉన్నత పాఠశాలలో మంగళవారం కనిపించిన దృశ్యాలు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు విభాగాల్లో ఆటల పోటీలు నిర్వహించారు. తొలుత వీటిని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులకు చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లతో పాటు, ఉపకార వేతనాల మంజూరు, వసతి గృహాలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వివిధ రకాల పరికరాలనూ ఉచితంగా అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం నిర్వహించిన పరుగు, చెస్‌, క్రికెట్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌, వాలీబాల్‌ తదితర క్రీడా పోటీల్లో సుమారు 400 మంది క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. ఇందులోని విజేతలకు డిసెంబర్‌ 3న నిర్వహించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్టు ఏడీ తెలిపారు.

న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం


జెండా ఊపి ఆటలపోటీలు ప్రారంభిస్తున్న విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు అర్చన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు