logo

విధుల నుంచి ఏపీవోను తొలగించకుంటే ఆందోళన

విద్యాశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై ఏపీవోగా పనిచేస్తున్న ఎస్జీటీ కేవీ.ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించాలని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు.

Published : 30 Nov 2022 02:07 IST

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యాశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై ఏపీవోగా పనిచేస్తున్న ఎస్జీటీ కేవీ.ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించాలని ఏపీటీఎఫ్‌ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌, డీఈవో విజయభాస్కర్‌లకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు డి శ్రీనివాసులు, రఘుబాబు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులెవరూ బోధనేతర కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నారు. ఏ ఉద్యోగి అయియినా డిప్యూటేషన్‌పై రెండు సంవత్సరాలకు మించి పనిచేయకూడదని.. అయితే ప్రసాద్‌ మాత్రం 2004 నుంచి బోధనేతర విధుల్లోనే ఉన్నట్లు తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతుండటమే కాకుండా మున్సిపల్‌ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అతని డిప్యూటేషన్‌ను రద్దు చేయకుంటే ఆందోళన చేసే దిశగా ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు