logo

గళం కలిపిన నాయక గణం

‘యువగళం’ పేరుతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు గురువారం ఆలయాల్లో పూజలు చేశాయి.

Published : 27 Jan 2023 02:13 IST

యువ నేత లోకేశ్‌ను కలిసి మద్దతు
జిల్లావ్యాప్తంగా ఆలయాల్లో పూజలు

తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో ఉమ్మడి ప్రకాశం తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ‘యువగళం’ పేరుతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు గురువారం ఆలయాల్లో పూజలు చేశాయి. యాత్రలో పాల్గొనేందుకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌, ఉమ్మడి ప్రకాశానికి చెందిన కొండపి, అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు పోతుల రామారావు, బీఎన్‌.విజయకుమార్‌, కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కందుకూరు నియోజకవర్గ బాధ్యుడు ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ, ఎమ్మెల్సీ తెదేపా అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ తదితరులు తిరుమలకు తరలివెళ్లారు. వేంకటేశ్వరస్వామిని గురువారం దర్శించుకున్నారు. అనంతరం లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.  అక్కడి నుంచి కుప్పం చేరుకుని శుక్రవారం ప్రారంభించనున్న పాదయాత్రలో మమేకం కానున్నారు.

* యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ కంభం పట్టణానికి చెందిన తెదేపా మైనారిటీ విభాగం నాయకుడు సయ్యద్‌ నూరుల్లా ఖాద్రి గిద్దలూరు వరకు సైకిల్‌యాత్ర చేపట్టారు. ఆయన్ను మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అభినందించారు.
* కనిగిరి పట్టణంలోని విఘ్నేశ్వరుని ఆలయంలో వాణిజ్య విభాగం, తెదేపా ఆధ్వర్యంలో గణనాథుడికి పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టారు. మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో అమరావతి గ్రౌండ్‌లో 1001 దీపాలు వెలిగించారు.
* పామూరులో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కొంజేటి సుభాషిణి ఆధ్వర్యంలో షిర్డీ సాయిబాబా దేవస్థానంలో పూజలు నిర్వహించారు. మల్లాలమ్మ తల్లి ఆలయంలో తెదేపా బీసీ నాయకులు పూజలు చేశారు.
* చీమకుర్తి ఇసుక వాగు శివాలయంలో తెదేపా నాయకుడు పారా సింగయ్య ఆధ్వర్యంలో 108 కొబ్బరి కాయలు కొట్టారు.
* నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరి కాయలు కొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని