logo

జేఈఈలో మెరుపులు

జేఈఈ మెయిన్స్‌ తొలివిడత(సెషన్‌-1) ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్టపడి ప్రణాళికతో చదివి లక్ష్యాన్ని సాధించారు. జనవరిలో జరిగిన ఈ పరీక్షకు జిల్లా నుంచి దాదాపు 12 వేల మంది హాజరయ్యారు.

Published : 08 Feb 2023 03:01 IST

మెయిన్స్‌ తొలి విడతలో జిల్లా విద్యార్థుల సత్తా
న్యూస్‌టుడే: గిద్దలూరు పట్టణం, దర్శి, ఒంగోలు నగరం

జేఈఈ మెయిన్స్‌ తొలివిడత(సెషన్‌-1) ఫలితాల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్టపడి ప్రణాళికతో చదివి లక్ష్యాన్ని సాధించారు. జనవరిలో జరిగిన ఈ పరీక్షకు జిల్లా నుంచి దాదాపు 12 వేల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా 99 పర్సంటైల్‌ సాధించిన విద్యార్థులను ‘న్యూస్‌టుడే’ పలకరించింది..


అనుకున్న లక్ష్యాన్ని సాధించా
మహమ్మద్‌ షాన్‌వాజ్‌, అనుమలవీడు, రాచర్ల

షాన్‌వాజ్‌ తండ్రి మహమ్మద్‌ రఫీ కొమరోలు మండలం సర్వేరెడ్డిపల్లె, తల్లి బెనజీర్‌ బేగం గిద్దలూరు మండలం బురుజుపల్లెలోని ఎంపీపీ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. షాన్‌వాజ్‌ నిత్యం 12 గంటల పాటు కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాడు. జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీ కళాశాలలో సీటు సాధించి కంప్యూటర్‌ సైన్స్‌లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.


తల్లి ప్రోత్సాహంతో చదివి..
గర్రె వెంకటసాయి ప్రణీత్‌, గిద్దలూరు

వెంకటసాయి తండ్రి శివకుమార్‌ మృతిచెందినప్పటికీ తల్లి పద్మజ ప్రోత్సాహంతో కష్టపడి చదివాడు. జెఈఈ మెయిన్స్‌ తొలివిడతలో అత్యుత్తమ స్కోరు సాధించాడు. కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేస్తానని తెలిపాడు.  


నిత్యం 13 గంటలు శ్రమించా
శిగుల్లపల్లి ఆకాష్‌, గిద్దలూరు

ఆకాష్‌ తండ్రి శ్రీనివాసులు ఓ దినపత్రికలో పనిచేస్తుండగా తల్లి సరిత గృహిణి. ఈ పరీక్ష కోసం నిత్యం 13 గంటల పాటు సాధన చేశానని ఆకాష్‌ తెలిపారు. టాప్‌-10 ఐఐటీ కళాశాలల్లో సీటు సాధించి కంప్యూటర్‌ సైన్స్‌ చేస్తానని తెలిపారు.


ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేస్తా
-సాయిసాత్విక్‌, దర్శి

సాయిసాత్విక్‌ తండ్రి చందలూరి పూర్ణచంద్రరావు వ్యాపారి. తల్లి మాధవి గృహిణి. పదోతరగతిలోనూ 10 జీపీˆఏ సాధించాడు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు 458 సాధించాడు. రోజుకు దాదాపు 15 గంటలపాటు కష్టపడుతున్నట్లు సాత్విక్‌ చెబుతున్నాడు. ఐఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మంచి కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేయాలన్నది అభిలాషగా తెలిపాడు.


అడ్వాన్స్‌డ్‌లోనూ రాణిస్తా..
-కంఠా విష్ణుమాధవ్‌, దర్శి

తండ్రి ఆదినారాయణబాబు దర్శిలోని ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు. తల్లి శోభారాణి వార్డు సచివాలయ కార్యదర్శి. పదో తరగతిలో 10 జీపీఏ వచ్చింది. ఇంటర్‌ ఒంగోలు శ్రీ సరస్వతి జూనియర్‌ కళాశాలలో చదువుతున్నాడు. ప్రథమ సంవత్సరంలో 470 మార్కులకు 464 సాధించాడు. నిట్‌లో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తమర్యాంకు సాధిస్తానని విష్ణుమాధవ్‌ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తంచేశాడు.


ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాలని..
-కొల్లూరి తనిష్క్‌, దర్శి

తండ్రి ప్రకాశరావు చందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు. పదోతరగతి గుంటూరులో చదివి 10 జీపీఏతో ప్రతిభ చూపాడు. ప్రస్తుతం సీˆబీఎస్‌ఈ ఇంటర్‌ చదువుతున్నాడు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీˆటు సాధించి ఇంజినీరింగ్‌ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు