logo

ప్రాథమిక స్థాయి నుంచి శ్రమిస్తే భవిత

విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచే శ్రమిస్తే బంగారు భవిత సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌ హితవు పలికారు.

Published : 27 Mar 2023 04:09 IST

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, తదితరులు

జిల్లా స్థాయి వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచే శ్రమిస్తే బంగారు భవిత సొంతమవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్‌ హితవు పలికారు. నగరంలోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రతిభా పాటవ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో శక్తి సామర్థ్యాలుంటాయని, వాటిని వెలికితీయడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. ‘ఈనాడు’ సంస్థ పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. పుస్తకాలు చదవడం వ్యాపకంగా పెట్టుకోవాలని సూచించారు. హర్షిణి కళాశాల ఛైర్మన్‌ గోరంట్ల రవికుమార్‌ మాట్లాడుతూ పాఠశాల, రీజనల్‌, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి ఎంఏ ఖాన్‌ మాట్లాడుతూ కేవలం వార్తలకే పరిమితం కాకుండా ఇలా అన్ని రంగాల్లో వారిని ప్రోత్సహించడానికి సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

నాలుగు నెలల్లో ...20,519 మంది

నాలుగు నెలలుగా వివిధ స్థాయిల్లో ‘ఈనాడు’ ప్రతిభా పాటవ పోటీలు నిర్వహించారు. మొత్తం 20,519 మంది విద్యార్థులు పాల్గొన్నారు. రెండో దశ రీజినల్‌ స్థాయిలో 560 మంది, మూడో దశ జిల్లాస్థాయిలో 72 మందికిగాను 59 మంది పాల్గొన్నారు. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, దర్శి, సింగరాయకొండ, మార్కాపురంలో రీజినల్‌ స్థాయి పోటీలు నిర్వహించారు. వ్యాసరచన, కథల సమర్పణ, చిత్రలేఖనం, క్విజ్‌ పోటీలు జరిపారు.   త్వరలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో బహుమతులు సాధించిన వారు రాష్ట్రస్థాయికి అర్హత పొందారు. పాల్గొన్న విద్యార్థులందరికీ పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు అందజేశారు. న్యాయ నిర్ణేతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, తదితరులు

పోటీల్లో విజేతలు వీరే...

డ్రాయింగ్‌: కనిగిరి మండలం కంచవారిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి జి.శ్రీవాణి ప్రథమ, సింగరాయకొండ శ్రీవిద్యానికేతన్‌ పదో తరగతి విద్యార్థి సీహెచ్‌ ఆర్తిశ్రీ ద్వితీయ, ఒంగోలు జ్యూపిటర్‌ స్కూలు 9వ తరగతి విద్యార్థి వి.భువనేశ్వరి తృతీయ స్థానాలు సాధించారు.
వ్యాసరచన: దర్శి శ్రీచైతన్య స్కూలు 9వ తరగతి విద్యార్థి ఎం.బేబి నివేదిత ప్రథమ, కంభం వాసవి స్కూలు 9వ తరగతి విద్యార్థి ఎం.ప్రవీణ ద్వితీయ, దర్శి మండలం పొతకమూరు జడ్పీ స్కూలు 9వ తరగతి విద్యార్థి జి.సుకన్య తృతీయ బహుమతిని గెల్చుకున్నారు.

కథన సమర్పణ: స్టోరీ టెల్లింగ్‌ విభాగంలో మార్కాపురం జడ్పీ స్కూలు ఎనిమిదో తరగతి విద్యార్థి వైవీటీ చంద్రిక ప్రథమ, ఒంగోలు కేరళ హైస్కూలు పదో తరగతి విద్యార్థి పి.శ్రావ్య ద్వితీయ, సింగరాయకొండ సెయింట్‌ జాన్స్‌ హైస్కూలు పదో తరగతి విద్యార్థి డి.దివ్యవాణి తృతీయ స్థానాల్లో నిలిచారు.
క్విజ్‌: సింగరాయకొండ శ్రీవిద్యానికేతన్‌ 8వ తరగతి విద్యార్థి ఎం.దత్తసాయి ప్రథమ, సింగరాయకొండ గీతం హైస్కూలు పదో తరగతి విద్యార్థి ఎస్‌కే హష్మి ద్వితీయ, నగరంలోని ఒంగోలు పబ్లిక్‌ స్కూలు 8వ తరగతి విద్యార్థి ఎం.జ్యోస్యశ్రీ తృతీయ బహుమతి గెలుచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని