logo

తలుపులు తెరిచినా.. పుస్తకాలేవీ!

వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ కళాశాలలు గురువారం నుంచి పునఃప్రారంభమయ్యాయి.

Published : 02 Jun 2023 05:45 IST

తొలిరోజు ఖాళీగా కళాశాలలు

టంగుటూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు న్యూస్‌టుడే బృందం
వేసవి సెలవుల అనంతరం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ కళాశాలలు గురువారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. మొత్తం 28 ప్రభుత్వ జూనియర్‌, మూడు ఎయిడెడ్‌, 78 అన్‌ ఎయిడెడ్‌ ఇంటర్‌ కళాశాలల్లో 26 వేల మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. వీటిల్లోని అయిదు యాజమాన్యాల పరిధిలోని విద్యాలయాల్లో చదివే సుమారు పది వేల మందికి ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. విద్యాలయాల తలుపులు తెరుచుకున్నప్పటికీ ఈ ఏడాది కూడా వారికి భంగపాటు తప్పలేదు.

*పాఠాలు నేర్వని ప్రభుత్వం...: గడిచిన సంవత్సరం చివరి వరకు ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందలేదు. ఈ పరిస్థితి ఫలితాలపై ప్రభావం చూపింది. జూనియర్‌ ఇంటర్‌ ఫలితాల్లో రాష్ట్రంలో ఏడోస్థానంలో, సీనియర్‌ ఇంటర్‌లో 11వ స్థానంలో నిలవాల్సి వచ్చింది. అయినా ప్రభుత్వం గత ఏడాది అనుభవాల నుంచి గుణపాఠం నేర్వలేదు. గురువారం నుంచి తరగతులు పునఃప్రారంభమైనప్పటికీ కొన్ని కళాశాలలు ఒక్క విద్యార్థి కూడా కూడా లేక వెలవెలబోయాయి.

*విద్యాలయాలు వెలవెల...* మొదటిరోజు సంతనూతలపాడు మండలం మైనంపాడులో ఒక్క విద్యార్థి కూడా కళాశాలకు రాలేదు. ఆరుగురు ఉపాధ్యాయులు కొత్తగా ప్రవేశాల కోసం గ్రామాల్లో పర్యటిస్తూ కనిపించారు.*కనిగిరిలో దాదాపు 150 మంది విద్యార్థులున్నారు. వీరెవరూ తొలిరోజు హాజరుకాలేదు. అధ్యాపకులు సాయంత్రం వరకు ఉండి వెళ్లారు. *చీమకుర్తి జూనియర్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదివే విద్యార్థులు 112 మంది ఉంటే తొలిరోజు అయిదారుగురు మాత్రమే వచ్చి వెళ్లారు. మొదటి సంవత్సరంలో ఇంకా ఎవరూ చేరలేదు. *సింగరాయకొండలో 221 మంది ఉన్నా ఎవరూ కనిపించ లేదు. *టంగుటూరులోనూ ఇదే పరిస్థితి. *కొమరోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరానికి సంబంధించి ఇంకా ఎవరూ చేరలేదు. *తాళ్లూరులోని వీకే ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కూడా వెలవెలబోతూ కనిపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు