logo

రూ. 2.12 లక్షల నగదు పట్టివేత

ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

Published : 25 Apr 2024 02:33 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ వద్ద ప్రత్యేక అధికారి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన అబ్బూరి ప్రవీణ్‌ కుమార్‌ కారులో రూ.2,12,680 నగదు ఉండటాన్ని గుర్తించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌ కుమార్‌ చిలకలూరిపేటలో రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నారు. అక్కడ పనిచేసే కార్మికులకు వేతనాలు చెల్లించేందుకు నగదు తీసుకెళ్తున్నట్లు తెలిపారని ఎస్సై శ్రీరామ్‌ వివరించారు.


అంటకాగిన కానిస్టేబుల్‌పై వేటు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన పోలీసు కానిస్టేబుల్‌ డీఎన్‌బీ.రత్నబాబు అలియాస్‌ గోపిపై చర్యలు తీసుకుంటూ జిల్లా పోలీసు కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైకాపా ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్‌రెడ్డి ప్రచారంలో రత్నబాబు పాల్గొన్నారు. తద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.జస్వంతరావు ఒంగోలు రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రత్నబాబు తాలుకా పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా చేస్తుండగా, ప్రస్తుతం ఎఫ్‌సీఐ దగ్గర చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు