logo

‘ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదు’

వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద

Published : 24 Jan 2022 03:27 IST

లోకేశ్‌ జన్మదినం సందర్భంగా కేక్‌ కోసి వేడుకలు చేస్తున్న కళా, తదితరులు

లావేరు గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం లావేరు మండలం సుభద్రాపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన నారా లోకేశ్‌ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్‌  కోశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళా మాట్లాడుతూ అమ్మఒడి పథకం ఎక్కడికి పోయిందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన కొనసాగుతోందని, దీనికి ముగింపు పలకాలంటే యువత నడుం బిగించాలన్నారు. ఈ మూడేళ్లలో రహదారుల మరమ్మతుకు ఒక్కపైసా ఖర్చు చేయలేదన్నారు. ప్రతిఒక్కరిపైనా కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయన్నారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. 2024 ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. నేతలు ముప్పిడి సురేష్‌, పి.మధుబాబు, ప్రకాశరావు, మహేశ్వరరావు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని