logo

పళ్లిపట్టులో వైభవంగా గంగజాతర

పళ్లిపట్టులో శ్రీకొళ్లాపురమ్మ, గంగమ్మ ఊరేగింపులు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి శ్రీకొళ్లాపురమ్మ ఆలయం ఎదుట నాదస్వర కచేరి, పాటకచేరి నిర్వహించారు. రాత్రి 10 గంటలకు శ్రీకొళ్లాపురమ్మను ప్రత్యేకంగా అలంకరించి పుష్పపల్లకిలో పట్టణ వీధుల్లో ఊరేగించారు.

Published : 19 May 2022 04:56 IST

వీపునకు కొక్కీలతో వేలాడుతున్న భక్తులు

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: పళ్లిపట్టులో శ్రీకొళ్లాపురమ్మ, గంగమ్మ ఊరేగింపులు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి శ్రీకొళ్లాపురమ్మ ఆలయం ఎదుట నాదస్వర కచేరి, పాటకచేరి నిర్వహించారు. రాత్రి 10 గంటలకు శ్రీకొళ్లాపురమ్మను ప్రత్యేకంగా అలంకరించి పుష్పపల్లకిలో పట్టణ వీధుల్లో ఊరేగించారు. ఊరేగింపు బుధవారం ఉదయం 9 గంటలకు ముగిసింది. ఆ తర్వాత గంగమ్మను ప్రత్యేకంగా అలంకరించి పట్టణ వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. ఆ సమయంలో వెయ్యికండ్ల మట్టికుండలో పిండిదీపం వెలిగించి వాటిని భక్తుల శిరస్సుపై మోసి గంగమ్మను వెంబడించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. పలువురు భక్తులు విన్యాసాలు ప్రదర్శించారు. చివరిగా సాయంత్రం 6 గంటలకు గంగమ్మను ఏటికసం వద్ద గుంటలో నిమజ్జనం చేశారు.

ప్రత్యేక అలంకరణతో ఊరేగుతున్న గంగమ్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని