logo

వైభవంగా బతుకమ్మ పండుగ

చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ పండుగ వైభవంగా జరిగింది. షావుకారుపేటలోని మింట్‌ వీధి కొండితోపు పరిసర ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఊరేగింపుగా తీసుకొచ్చారు.

Published : 26 Sep 2022 02:04 IST

బతుకమ్మ ఆడుతున్న మహిళలు

చెన్నై(సాంస్కృతికం), న్యూస్‌టుడే: చెన్నై తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ పండుగ వైభవంగా జరిగింది. షావుకారుపేటలోని మింట్‌ వీధి కొండితోపు పరిసర ప్రాంతాల నుంచి వివిధ రకాల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల బయట ప్రాంగణం దీనికి వేదికైంది. అవసరమైన విద్యుత్‌ దీపాలంకరణ, నేపథ్య సంగీతం మరింత కనువిందు చేసింది. మహిళలందరూ సంప్రదాయ దుస్తులు ధరించి భక్తి శ్రద్ధలతో నాట్యం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని