logo

పల్లావరం చెరువులో పారిశుద్ధ్య పనులు

ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకుని దక్షిణ భారత్‌ ఏరియా భారత సైనిక విభాగం ఆధ్వర్యంలో 12 మద్రాస్‌, ఉడాన్‌, ఎక్స్‌నోరా సంస్థలు కలిసి పల్లావరం చెరువు శుభ్రతా పనుల్లో ఆదివారం పాల్గొన్నాయి.

Published : 05 Jun 2023 04:53 IST

పాల్గొన్న సిబ్బందికి బహుమతులు అందజేస్తున్న బ్రర్‌

వడపళని, న్యూస్‌టుడే: ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకుని దక్షిణ భారత్‌ ఏరియా భారత సైనిక విభాగం ఆధ్వర్యంలో 12 మద్రాస్‌, ఉడాన్‌, ఎక్స్‌నోరా సంస్థలు కలిసి పల్లావరం చెరువు శుభ్రతా పనుల్లో ఆదివారం పాల్గొన్నాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు భారత సైనిక విభాగ ఆధ్వర్యంలో 2 నుంచి 4వ తేదీ వరకు జరిగాయి. ఆదివారం పల్లావరం చెరువు శుద్ధీకరణ, పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దక్షిణ భారత్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ (జీఓసీ), ల్యూటెనెంట్‌ జనరల్‌ కేఎస్‌ బ్రర్‌ సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సేవలందించిన సంస్థల సిబ్బందికి బ్రర్‌ బహుమతులు ప్రదానం చేశారు.

శుభ్రం చేస్తున్న దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని