logo

కాంగ్రెస్‌పై కమల్‌హాసన్‌ కినుక?

కాంగ్రెస్‌ను మినహాయించి డీఎంకే కూటమి పార్టీల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసేలా కమల్‌హాసన్‌ షెడ్యూల్‌ రూపొందడం చర్చనీయాంశమైంది.

Published : 27 Mar 2024 00:22 IST

చెన్నై, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ను మినహాయించి డీఎంకే కూటమి పార్టీల అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం చేసేలా కమల్‌హాసన్‌ షెడ్యూల్‌ రూపొందడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌పై ఆయన కినుక వహించారని ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూటమికి మద్దతు తెలిపిన మక్కళ్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు ఒక రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. కూటమికి మద్దతుగా తమిళనాడు, పుదుచ్చేరిలో ప్రచారం చేపడతారని ప్రకటించారు. ఆ మేరకు 29న ఈరోడులో ప్రారంభించి ఏప్రిల్‌ 16 పొల్లాచ్చిలో ముగించనున్నారు. మొత్తం 11 రోజులు షెడ్యూల్‌ సిద్ధం చేసుకున్నారు. కూటమిలోని డీఎంకే, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. షెడ్యూల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాలు లేకపోవడం చర్చగా మారింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్‌ అధిష్ఠానంతో కమల్‌ మంతనాలు జరిపారని, ఆ సమయంలో ఆయన్ను దిల్లీ పెద్దలు విస్మరించి ఉండొచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని