logo

తాగునీటికి రాస్తారోకో

కోవై జిల్లా మేట్టుపాళ్యం సమీప ఆలంగుడి గ్రామంలో నెలరోజులుగా తాగునీటి సరఫరా ఆగిపోయింది. అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో శిరుముగై- సత్తి మార్గంలో రాస్తారోకోకు దిగారు.

Published : 01 May 2024 01:17 IST

ప్రజలతో మాట్లాడుతున్న రెవెన్యూ అధికారులు

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోవై జిల్లా మేట్టుపాళ్యం సమీప ఆలంగుడి గ్రామంలో నెలరోజులుగా తాగునీటి సరఫరా ఆగిపోయింది. అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో శిరుముగై- సత్తి మార్గంలో రాస్తారోకోకు దిగారు. గ్రామానికి తిరుప్పూర్‌ తాగునీటి పథకం నుంచి మంచినీరు సరఫరా చేయాలని కోరుతూ రాత్రంతా రోడ్డుపైనే బైఠాయించారు. సమాచారం తెలిసి అక్కడికి చేరుకున్న రెవెన్యూ అధికారులు ప్రజలతో చర్చలు జరిపినా దిగిరాలేదు. తమ ప్రాంతానికి కలెక్టరు రావాలని నినాదాలు చేశారు. మంగళవారం ఎండ ఎక్కువగా ఉండటంతో స్థానికులు అక్కడ పందిరి ఏర్పాటు చేసి అల్పాహారం అందించారు. రాస్తారోకో కారణంగా శిరుముగై-సత్తి మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించింది. అక్కడ పోలీసులను మోహరించారు. మంగళవారం ఉదయం ట్వాడ్‌ బోర్టు అసిస్టెంటు ఇంజినీర్‌ చిత్ర నేతృత్వంలో అధికారులు అక్కడికి చేరుకొని ప్రజలతో మాట్లాడారు. రెండు రోజులకోసారి 3 లక్షల లీటరల నీటిని ఆలంగుడి గ్రామానికి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని