AP News: విశాఖలో బీరు బాటిళ్లు, కత్తితో యువకుడి హల్‌చల్‌

విశాఖ నగరంలోని ఎండాడ పెట్రోల్‌ బంక్‌ వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు.

Updated : 03 Dec 2021 12:19 IST

ఎండాడ: విశాఖ నగరంలోని ఎండాడ పెట్రోల్‌ బంక్‌ వద్ద మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. కత్తిపట్టుకుని అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. యువకుడి వీరంగంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. కాసేపటికి బీరు బాటిళ్లు పగులగొట్టి జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులను అడ్డగించాడు. ఓ కారు అద్దం కూడా పగులగొట్టాడు. కొందరు స్థానికులు యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆరిలోవ పోలీసులకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని