logo

‘అనంతబాబును రాజకీయాల నుంచి బహిష్కరించాలి’

ఎమ్మెల్సీ అనంతబాబును రాజకీయాల నుంచి శాశ్వత బహిష్కరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకర్‌ అన్నారు.

Published : 26 May 2022 05:36 IST

మద్దిలపాలెం, న్యూస్‌టుడే : ఎమ్మెల్సీ అనంతబాబును రాజకీయాల నుంచి శాశ్వత బహిష్కరణ చేయాలని మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకర్‌ అన్నారు. బుధవారం ఆయన విశాఖ వైకాపా నగర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ అనంతబాబు అనైతికమైన రాజకీయ నాయకుడిగా ఉన్నారన్నారు. అతని దుర్మార్గాలు బయటకు వస్తున్నా యన్నారు. పార్టీలో కూడా అతనిపై చర్చ జరుగుతుందన్నారు. అతన్ని జీవితకాలం శిక్షించాలన్నారు. కోనసీమలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఈ దాడుల వెనుక తెదేపా, జనసేనల హస్తం ఉందన్నారు. బస్సుయాత్ర విజయవంతం కాకుండా ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయన్నారు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని