logo

ఆక్రమిత స్థలంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

గంగవరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు శుక్రవారం సర్వే నెంబరు 38లోని భూములను పరిశీలించారు.సర్వే నెం. 38/1లో ఒక ఎకరం, సర్వే నెం.

Published : 28 May 2022 04:14 IST

ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డుతో అధికారులు

సబ్బవరం, న్యూస్‌టుడే: గంగవరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రెవెన్యూ అధికారులు శుక్రవారం సర్వే నెంబరు 38లోని భూములను పరిశీలించారు.సర్వే నెం. 38/1లో ఒక ఎకరం, సర్వే నెం. 38/1లో 6 నుంచి 12 వరకు ఉన్న సబ్‌ డివిజన్లలోని 1.62 ఎకరాలు మొత్తం 2.66 ఎకరాల భూమిని ఆక్రమించి లేఅవుట్‌ వేశారని గుర్తించారు.  సర్వేయర్‌ కె.వెంకటరమణ, ఆర్‌ఐ రమణ మాట్లాడుతూ సర్వే నెం. 38లో 36.37 ఎకరాల భూమి ఉందన్నారు. సర్వే నెం. 38/1లో 20.44 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా. మిగిలిన 15.93 ఎకరాలకు డీఫారం పట్టాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వ స్థలంలోకి ఎవరూ రాకుండా చర్యలు చేపట్టామన్నారు. జీవీఎంసీ ప్రణాళిక విభాగం అధికారి శ్రీనివాసరావు, ఛైన్‌మన్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని