logo

ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు

విజయనగరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బందిపై కచ్చితమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరు ఎం.మల్లయ్యనాయుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Published : 29 Mar 2024 04:13 IST

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: విజయనగరం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళికా విభాగంలో సిబ్బందిపై కచ్చితమైన ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనరు ఎం.మల్లయ్యనాయుడు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ‘ఈనాడు’లో ఈనెల 28న ‘పనికో రేటు.. అదే రూటు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. భవన నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తులు పెండింగ్‌లో లేవని చెప్పారు. అనధికార నిర్మాణాలు, ఉల్లంఘనలు, ఆక్రమణలపై సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శులు, ప్రణాళికా విభాగం సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని