logo

అయిదు రోజులు..ఆదాయం రూ.9.45 కోట్లు

ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సందర్భాలను ఉపయోగించుకుని ప్రయాణికులను ఆకర్షిస్తూ రాబడి పెంచుకుంటున్న నేపథ్యంలో ఆ ఒరవడిని వరంగల్‌ రీజియన్‌ అందిపుచ్చుకుంటోంది. కొవిడ్‌ నుంచి క్రమంగా కోలుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. గత శుక్రవారం

Published : 18 Aug 2022 05:24 IST

న్యూస్‌టుడే, హనుమకొండ కలెక్టరేట్‌

హనుమకొండ బస్టాండులో ప్రయాణికుల రద్దీ

ఆర్టీసీ సంస్థ ప్రత్యేక సందర్భాలను ఉపయోగించుకుని ప్రయాణికులను ఆకర్షిస్తూ రాబడి పెంచుకుంటున్న నేపథ్యంలో ఆ ఒరవడిని వరంగల్‌ రీజియన్‌ అందిపుచ్చుకుంటోంది. కొవిడ్‌ నుంచి క్రమంగా కోలుకుంటూ లాభాల బాటలో పయనిస్తోంది. గత శుక్రవారం రాఖీ పండగ సంస్థకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. గురు, శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అనుకున్నదాని కంటే అధికంగా రాకపోకలు జరిగి మునుపెన్నడూ లేనంతగా సంస్థకు రూ.9.45కోట్ల ఆదాయం ఆర్జించి రాష్ట్ర్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. సాధారణ రోజుల్లో రూ.కోటి ఆదాయం వస్తే ఇప్పుడు అంతకుమించి వచ్చింది. రీజియన్‌లోని 9 డిపోల పరిధిలో పండగ వేళ రద్దీగా ఉండే ప్రాంతాల్లో అధికారులు ప్రణాళికబద్ధంగా బస్సులు నడపడంలో సఫలమయ్యారు. వరుస వర్షాల కారణంగా ఆదాయం పడిపోగా వర్షాలు తగ్గుముఖం పట్టి ప్రయాణికులు రాకపోకలను కొనసాగిస్తుండటంతో అవకాశాన్ని ఆర్టీసీ రీజియన్‌ రాఖీ పండుగ సందర్భంగా అందిపుచ్చుకుంది. గత 2019లో రాఖీ పండగ సందర్భంగా మూడు రోజుల్లో రూ.4.24 కోట్లురాగా, 2020లో రూ.1.32కోట్లు, 2021లో రూ.4.31 కోట్లకు చేరింది.

ఉద్యోగులు, కార్మికుల కృషి ఫలితమే.. - వి.శ్రీదేవి, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల అందరి కృషి ఫలితంగా రాఖీ పండగ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాం. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువ ఆదాయాన్ని ఈ ఐదు రోజుల్లో తీసుకురాగలిగాం. రద్దీ ఉన్న ప్రాంతాలను గుర్తించి బస్సులను ఏర్పాటు చేశాం. సిబ్బంది ఈ రాత్రి, పగలు తేడా లేకుండా పని చేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, సంస్థ పలు రాయితీలు ప్రకటించడంతో ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.

రోజుల వారీగా ఆదాయం (రూ.కోట్లల్లో)

గురువారం 1.83

శుక్రవారం 2.29

శనివారం 1.94

ఆదివారం 1.69

సోమవారం 1.69

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని