logo

కనుమరుగవుతున్న చారిత్రక ఆనవాళ్లు

నారాయణగిరి గ్రామం ఓ ఆధ్యాత్మిక ప్రాంతం. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలకు సంబంధించిన ఆనవాళ్లు ఒకే చోట ఉండటం విశేషం. ఒకే బండకు 18 దేవతామూర్తుల శిల్పాలు చెక్కి ఉండటం అత్యంత అద్భుతమని చెప్పొచ్చు.

Updated : 27 Sep 2022 05:42 IST

అప్పటి పెద్ద ఇటుకలను చూపిస్తున్న చారిత్రక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి

ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: నారాయణగిరి గ్రామం ఓ ఆధ్యాత్మిక ప్రాంతం. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలకు సంబంధించిన ఆనవాళ్లు ఒకే చోట ఉండటం విశేషం. ఒకే బండకు 18 దేవతామూర్తుల శిల్పాలు చెక్కి ఉండటం అత్యంత అద్భుతమని చెప్పొచ్చు. ఈ ప్రాంతం విధ్వంసానికి గురవుతోంది. చారిత్రక ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. ఎలగుట్ట దిగువన లోయలో ఉన్న మూడు బౌద్ధ స్తూపాల్లో ఒక్కటి పూర్తిగా చెరిగిపోగా, రెండోది నామమాత్రంగా ఉంది. రైతులు తమ సాగు అవసరాల కోసం మూడో స్తూపాన్ని పూర్తిగా తవ్వారు.  నారాయణగిరి గ్రామం యుద్ధవీరులకు ప్రసిద్ధి అని చెప్పడానికి వీరగల్లులు సాక్షం. వీరోచితంగా పోరాడి యుద్ధ రంగంలో నేలకొరిగిన వీరుల జ్ఞాపకార్థంగా కట్టించిన ఆలయం ప్రస్తుతం పూర్తిగా కూలిపోయింది. ఇక్కడ భూమి లోపల, బయట కలిపి 20 మంది వీరుల శిల్పాలు ఉన్నాయి. వీటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

* గుట్టల సమీపంలోని భూమిని సాగుచేసే క్రమంలో అక్కడి రాక్షస గూళ్లు తొలగించారు. అక్కడక్కడ సమాధిపై పేర్చిన కప్పు బండలు బయటపడుతున్నాయి. ఆకాలమ్మ రాళ్ల గుట్ట మీద పూర్వం ఇనుప రాళ్ల నుంచి ఇనుమును సంగ్రహంచిన పరిశ్రమ ఉంది. ఇది బృహత్‌ శిలా యుగం నాటిదే. ఈ ప్రాంతంలో అడుగడుగున ప్రాచీన కాలపు మట్టి పెంకులే దర్శనమిస్తాయి. బౌద్ధ స్తూపాలకు రెండో వైపు బోడగుట్ట ఉంది. సహజ సిద్ధమైన గుహలో ప్రధాన శిలకు శిల్పం చెక్కబడి ఉంది. లింగంబోడు ప్రాంతంలో జైన శాసనం ఉంది. ప్రస్తుతం వీటి ఆనవాళ్లు కనుమరుగవుతున్నాయి. వీటిని కాపాడి భావితరాలకు తెలియజేయాలి.

దేవతామూర్తుల శిల్పాలు చెక్కిన అతిపెద్ద బండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని