logo

లీకుల ముప్పు.. ఏదీ కనువిప్పు..!

మన్యానికి సాగునీటి వరదాయినిగా పేరొందిన వెంకటాపురం మండలంలోని పాలెంవాగు మధ్యతరహా జలాశయం నిర్వహణ గాడి తప్పింది. పంట పొలాలకు నీటిని సరఫరా చేసే ప్రధాన కాలువలో అంతర్భాగంగా రాళ్లవాగుపై నిర్మించిన కాంక్రీట్‌ అక్విడెక్టుకు లీకులు ఏర్పడ్డాయి.

Published : 04 Oct 2022 03:38 IST

వెంకటాపురం, న్యూస్‌టుడే: మన్యానికి సాగునీటి వరదాయినిగా పేరొందిన వెంకటాపురం మండలంలోని పాలెంవాగు మధ్యతరహా జలాశయం నిర్వహణ గాడి తప్పింది. పంట పొలాలకు నీటిని సరఫరా చేసే ప్రధాన కాలువలో అంతర్భాగంగా రాళ్లవాగుపై నిర్మించిన కాంక్రీట్‌ అక్విడెక్టుకు లీకులు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లు స్వల్పంగా ఉన్న బుంగలు కాస్తా పెద్దవిగా ఏర్పడి ముప్పును హెచ్చరిస్తున్నాయి. పెద్ద ఎత్తున సాగునీరు వృథా అవుతోంది. అక్విడెక్టు ఇరు వైపులా గోడలకు ఇదే పరిస్థితి దాపురించింది. ఆ బుంగలు మరింత పెద్దవిగా మారితే కట్టడం కూలే ప్రమాదం ఉన్నట్లు కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారుల్లో కనువిప్పు లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని