logo

అండగా ఉంటా.. అధైర్య పడొద్దు

ఆపదలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని తిడుగు, కోనాయచలం, ఉప్పుగల్లులో పర్యటించారు.

Published : 04 Oct 2022 03:38 IST

తిడుగులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీహరి

జఫర్‌గఢ్‌, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న కార్యకర్తలను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మండలంలోని తిడుగు, కోనాయచలం, ఉప్పుగల్లులో పర్యటించారు. తిడుగుకు చెందిన వాసం రామయ్య, బండి రామక్క, మాదారపు పోషమ్మ, కోనాయచలంకు చెందిన  సొంటిరెడ్డి వజ్రమ్మ, రడపాక నర్సయ్య, ఉప్పుగల్లుకు చెందిన గంగదారి మల్లేష్‌, యాట ఆగయ్య, మంద రామరాజు ఇటీవల మృతి చెందగా, బాధిత వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు రాజకీయ జన్మనిచ్చిన ప్రజలకు తాను అందుబాటులో ఉంటానన్నారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ ఛైర్మన్‌ కరుణాకర్‌రావు, సర్పంచులు గాదెపాక సువర్ణ, సంపత్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రజిత, దేవేందర్‌, వెంకటస్వామి, తెరాస నాయకులు మోహన్‌రావు, ఆయోధ్య, శ్రీధర్‌, భాషా, హరి, యాదగిరి, రవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని