logo

పోలీసు అధికారి బెదిరింపు

పోలీసు అధికారి కుటుంబ విషయంలో మరో పోలీసు అధికారి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో పాటు అతణ్నే బెదిరించాడు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.

Published : 04 Oct 2022 03:38 IST

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: పోలీసు అధికారి కుటుంబ విషయంలో మరో పోలీసు అధికారి మితిమీరిన జోక్యం చేసుకోవడంతో పాటు అతణ్నే బెదిరించాడు. ఈ ఘటనపై సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.  పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండలో ఉంటున్న పోలీసు అధికారి వేరే జిల్లాలో పనిచేస్తున్నారు. ఆయన సతీమణి సైతం నగరంలో పోలీసు అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. తనతోపాటు పనిచేస్తున్న మరో అధికారికి ఆమె తరచూ ఫోను చేస్తుండడంతో గమనించిన భర్త  పలుసార్లు హెచ్చరించారు. అయినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. భార్యతో మాట్లాడుతున్న అధికారిని కూడా ఆయన మందలించారు. అయినప్పటికీ వారు తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. సోమవారం తాను లేని సమయంలో ఆ అధికారి ఇంటికి వచ్చాడని తెలుసుకొని మరోసారి హెచ్చరించారు. ఇది సహించని ఆ పోలీసు అధికారి ఆమె భర్తను చంపేస్తానని బెదిరించాడు. దీంతో అతడు సుబేదారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని