logo

పరుగెత్తు.. కొలువు సాధించు..!

ఎస్సై, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలను వచ్చే నెల 8న నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి నిర్ణయించింది.

Published : 28 Nov 2022 05:04 IST

సాధన చేస్తున్న మహిళా అభ్యర్థులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: ఎస్సై, కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలను వచ్చే నెల 8న నిర్వహించేందుకు పోలీసు నియామక మండలి నిర్ణయించింది. దీంతో అభ్యర్థులు కసరత్తు వేగాన్ని పెంచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించిన పరీక్షలను కేయూ మైదానంలో నిర్వహించనున్నారు. పోలీసు కొలువు సాధించడమే లక్ష్యంగా అభ్యర్థులు కేయూ, ఆర్ట్స్‌ కళాశాల మైదానాల్లో చెమటోడుస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఈ మైదానాలు అభ్యర్థులతో  కిటకిటలాడుతున్నాయి. గతంలో 800, 100 మీటర్ల పరుగు, హైజంప్‌, లాంగ్‌ జంప్‌, షాట్‌ఫుట్‌ నిర్వహించేవారు. ఈ సారి మాత్రం మూడు ఈవెంట్లకి పరిమితం చేశారు. 1600 మీటర్ల పరుగు (పురుషులు 7.15 నిమిషాలు), 800 మీటర్లు (మహిళలు- 5.20ని.) షాట్‌ఫుట్‌, లాంగ్‌ జంప్‌ మాత్రమే ఉన్నాయి. వీటిలో వచ్చిన మార్కులను తుది పరీక్షల్లో కలుపుతారు. వీరందరికి పరుగే అత్యంత కీలకం కానుంది. నగర కమిషనరేట్‌ ఆధ్వర్యంలో అభ్యర్థులకు శిక్షణ ఇస్తుండగా, ఆదివారం కేయూ మైదానంలో సీపీ తరుణ్‌జోషి ఆదేశాల మేరకు నమూనా దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని