logo

మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులు

జాతీయ మానవ హక్కుల నాయకులు, జర్నలిస్టులంటూ పలువురిని బెదిరిస్తున్న వారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

Published : 30 Nov 2022 03:53 IST

నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసు అధికారులు

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: జాతీయ మానవ హక్కుల నాయకులు, జర్నలిస్టులంటూ పలువురిని బెదిరిస్తున్న వారిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి కారు, ద్విచక్ర వాహనం, ఇతర పత్రాలు, గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌జీ, షుకుర్‌లు నిందితుల వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన తాటికాయల క్రాంతికుమార్‌, వరంగల్‌ రంగశాయిపేటకు చెందిన బుంగ జ్యోతి, మరికొంత మందితో కలిసి జాతీయ మానవ హక్కుల సంఘం, జర్నలిస్టులు, గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ కో-ఆర్డినేటర్స్‌, న్యాయవాదులమంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల హనుమకొండ ఠాణా పరిధిలోని పెద్దమ్మగడ్డలో భీమయ్య అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని బంధువులు ధర్నా చేస్తుంటే ఎస్సై రాజు తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. జన్ను రాజు అనే వ్యక్తి ఫోన్‌ చేసి జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యుడు క్రాంతి మాట్లాడతారని ఎస్సైకి ఫోన్‌ ఇచ్చాడు. ఎస్సైని బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయగా, గతంలో అనేక మందిని క్రాంతితో పాటు మరికొంత మంది కలిసి బెదిరింపులకు పాల్పడ్డారని విచారణలో తేలింది. రాష్ట్రంలోని పలు స్టేషన్లలో వీరిపై కేసు నమోదైంది. భూవివాదాల్లో తలదూర్చడం, మహిళలను వేధించడం ఈ గ్యాంగ్‌ చేసిందని, నిందితులను అరెస్టు చేశామని, మరికొంత మంది పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని