logo

యాత్రకు సర్వం సిద్ధం

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించనున్న   ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ తొలిదశ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు మేడారం నుంచి రామప్ప వరకు దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.

Published : 06 Feb 2023 04:23 IST

నేడు వనదేవతల సన్నిధి నుంచి ప్రారంభం
ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సోమవారం మేడారంలో సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచి ప్రారంభించనున్న   ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ తొలిదశ యాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు మేడారం నుంచి రామప్ప వరకు దాదాపు 52 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.

రేవంత్‌రెడ్డి.. హైదరాబాద్‌ నుంచి పార్టీ ముఖ్య నేతలతో కలిసి వాహనాల్లో ములుగు గట్టమ్మ, సాయిబాబా ఆలయాలకు చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి మేడారం వస్తారు.

పటిష్ఠ బందోబస్తు..: యాత్రకు ములుగు జిల్లా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించనున్నారు. తాడ్వాయి, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్‌ మండలాల మీదుగా సాగనున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు.

* సోమవారం ఉదయం 11 గంటలు: మేడారంలో సమ్మక్క, సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు..

* మధ్యాహ్నం 12: ఆలయం నుంచి బయలుదేరుతారు.. కొత్తూరు, నార్లాపూర్‌ గ్రామాల మీదుగా గోవిందరావుపేట ప్రాజెక్ట్‌ నగర్‌ చేరుకుంటారు.

* 2 నుంచి 2:30: భోజన కార్యక్రమం (ప్రాజెక్టు నగర్‌లో)

* 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు: ప్రాజెక్ట్‌ నగర్‌ నుంచి పస్రా చేరుకుంటారు.

* 4:30 నుంచి 5 వరకు: పస్రాలో తేనీరు విరామం

* 5 నుంచి 6 వరకు: పస్రా కూడలిలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

* 6 నుంచి 8 వరకు: పస్రా, గోవిందరావుపేట, చల్వాయి, మచ్చాపూర్‌, వెంకటాపూర్‌ మండలం జవహర్‌నగర్‌, ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్‌, ఇంచర్ల, వెంకటాపూర్‌ క్రాస్‌ మీదుగా పాలంపేట చేరుకుంటారు.

* రాత్రి పాలంపేట (రామప్ప)లో బస

రెండో రోజు రామప్ప నుంచి..

మంగళవారం ఉదయం రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం యాత్ర ప్రారంభించి పాలంపేట, రామాంజపూర్‌, చెంచుకాలనీ, నారాయణగిరిపల్లి మీదుగా గణపురం మండలం బుద్ధారానికి మధ్యాహ్నం 1:30 వరకు చేరుకుంటారు.  

* మధ్యాహ్నం 1:30 నుంచి 2:00 గంటల వరకు భోజన కార్యక్రమం (బుధ్దారం-చాతరాజుపల్లి గ్రామాల మధ్య) ఉంటుంది.

* మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి బుద్ధారం, కేశవాపూర్‌, నర్సాపూర్‌, బండారుపల్లి మీదుగా సాయంత్రం 6 వరకు ములుగు చేరుకుంటారు. ఇక్కడి గాంధీ పార్కు వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని