‘పశ్చిమలో కాంగ్రెస్ గెలుపు ఖాయం’
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న నాయిని రాజేందర్‌రెడ్డి
మట్టెవాడ, న్యూస్‌టుడే: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని కాంగ్రెస్ భవన్‌లో డివిజన్ అధ్యక్షులు, సోషల్ మీడియా బృందం, ముఖ్య కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేరవేయాలని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ నాయకులను నిలదీసేలా ప్రజలను చైతన్యపరచాలని తెలిపారు. ఆరు మాసాల్లో వచ్చే ఎన్నికలకు ప్రతి కార్యకర్త శక్తిమేరకు పనిచేయాలని, భవిష్యత్తులో వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు భారాస ప్రభుత్వాన్ని గద్దె దింపే అవకాశం వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్‌రావు, కార్పొరేటర్లు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు బన్నీ లక్ష్మణ్, మహిళా నాయకురాలు సరళ, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ వెంకట్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.