logo

ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే!

ఉన్నత విద్యావంతులు శాసనసభకు ఎన్నికైతే ప్రజలకు మేలే కలుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి, సంస్కరణలకు శ్రీకారం చుట్టగలరు.

Updated : 17 Nov 2023 05:48 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే, యంత్రాంగం

ఉన్నత విద్యావంతులు శాసనసభకు ఎన్నికైతే ప్రజలకు మేలే కలుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి, సంస్కరణలకు శ్రీకారం చుట్టగలరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న వారిలో ఎక్కువ మంది డిగ్రీ ఆపై చదువులు చదివిన వారే.  వైద్యం, ఇంజినీరింగ్‌, పీహెచ్‌డీ చేసినా ప్రజాసేవపై మక్కువతో రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. వ్యవసాయం, వ్యాపారం, కాంట్రాక్టర్లుగా వివిధ వృత్తుల్లో రాణిస్తూ.. రాజకీయాల్లోకి దిగారు మరికొందరు. వీరంతా ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  

సెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో విద్యావంతులే ఎక్కువగా ఉన్నారు. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు చదువుకున్న వారున్నారు. వైద్యులు, అధ్యాపకులు, న్యాయవాదులు వ్యవసాయం, తదితర వృత్తుల వారు  బరిలో నిలిచారు. విద్యాపరంగా చూస్తే పీహెచ్‌డీ చేసిన వారు నలుగురు, పీజీ చదివిన వారు ఆరుగురు, ఎంబీబీఎస్‌ ఇద్దరు, పీజీ వైద్యులు ముగ్గురు ఉన్నారు. బీటెక్‌ ఇద్దరు, డిగ్రీ 11 మంది, ఫిజియోథెరపీ ఒకరు, డిప్లొమా ఇద్దరు, ఇంటర్మీడియట్‌ చదివిన వారు నలుగురు, ఐటీఐ, పదో తరగతి చదివిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. వృత్తిపరంగా అధ్యాపక వృత్తిలో ముగ్గురు, వ్యాపార రంగంలో 15 మంది ఉన్నారు. అడ్వకేట్‌గా ఒకరు, వైద్యులుగా ఐదుగురు, వ్యవసాయం చేస్తున్నవారు ఎనిమిది మంది ఉన్నారు.  పోలీస్‌ (ఐపీఎస్‌) అధికారిగా ఒకరు రిటైరవ్వగా, ఇంజినీరుగా ఒకరు పనిచేస్తున్నారు. రాజకీయాల్లోనే కొనసాగుతున్న వారు మరికొందరున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని