logo

ఎర్రగట్టు గుట్టపై క్షీరాభిషేకం

భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు.

Published : 29 Mar 2024 06:06 IST

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: భీమారంలోని ఎర్రగట్టు గుట్టపై వెలసిన వేెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు శ్రీదేవి-భూదేవి సమేత శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.

ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఈవో పి.కిషన్‌రావు తెలిపారు. అర్చకులు వేదాంతం పార్థసారథి చార్యులు, ఆరుట్ల శ్రీధరాచార్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారికి అభిషేకం చేశారు. కొండమీదున్న గండ దీపంలో భక్తులు నూనె పోసి  మొక్కులు చెల్లించుకున్నారు. విశ్వక్సేన సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని