logo

లోక్‌సభ ఎన్నికల్లో ధర్మ సమాజ్‌ పార్టీ పోటీ

తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్‌ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌ తెలిపారు.

Published : 18 Apr 2024 06:07 IST

సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌, చిత్రంలో నేతలు కె.ప్రసాద్‌, దుర్గాప్రసాద్‌

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్‌ పార్టీ (డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్‌ మహారాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా తమ పార్టీ నుంచి బరిలో దిగే 14 మంది ఎంపీ అభ్యర్థులతోపాటు కంటోన్మెంట్‌లో పోటీచేయనున్న అభ్యర్థి పేరు కూడా ప్రకటించారు. హైదరాబాద్‌ బర్కత్‌పురలోని డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ దఫా కేంద్ర ఎన్నికల సంఘం తమకు చెప్పుల గుర్తు కేటాయించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, విలువలను విస్మరించి.. ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాసేందుకు భాజపా, కాంగ్రెస్‌, భారాస పార్టీలు ఒక్కటయ్యాయని ఆయన ఆరోపించారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా మేకల సుమన్‌, మహబూబాబాద్‌ అభ్యర్థిగా రవ్వ భద్రమ్మను ఖరారు చేసినట్లు చెప్పారు. పార్టీ రాష్ట్ర నేతలు కె.ప్రసాద్‌, దుర్గాప్రసాద్‌, అన్నెల లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని