logo

AP News: గుప్పెడంత పడేయాలన్నా.. మేం గుర్తుకు రావాలి

ఆహారాన్ని పడేసే బదులు తమకిస్తే పేదల కడుపు నింపుతామంటున్నారు ‘యాపిల్‌ హోమ్‌ రియల్‌ నీడ్‌ ఇండియా ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలు నీలిమా ఆర్య. ఆకలితో ఎవరూ పడుకోకూడదనే లక్ష్యంతో ‘ఫీడ్‌ ద నీడ్‌- గిఫ్ట్‌ ఎ మీల్‌’ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు

Updated : 24 Dec 2021 09:24 IST


తణుకులో ఏర్పాటు చేసిన ‘ఫీడ్‌ ద నీడ్‌’ స్టాల్‌

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ఆహారాన్ని పడేసే బదులు తమకిస్తే పేదల కడుపు నింపుతామంటున్నారు ‘యాపిల్‌ హోమ్‌ రియల్‌ నీడ్‌ ఇండియా ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలు నీలిమా ఆర్య. ఆకలితో ఎవరూ పడుకోకూడదనే లక్ష్యంతో ‘ఫీడ్‌ ద నీడ్‌- గిఫ్ట్‌ ఎ మీల్‌’ రిఫ్రిజిరేటర్లను ఏర్పాటు చేయాలనేది వీరి సంకల్పం. వీటిలో ఎవరైనా, ఎప్పుడైనా ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెట్టొచ్ఛు తీసుకెళ్లొచ్ఛు పాలు, పెరుగు, మంచినీళ్లు, పండ్లు, గుడ్లు, శాకాహారం, మాంసాహారం.. ఇలా ఎలాంటి ఆహార పదార్థాలనైనా విడివిడిగా పెట్టే వీలు ఉంటుంది. రాష్ట్రంలో తొలిసారిగా తణుకులో ఇటీవల ఈ తరహా రిఫ్రిజిరేటర్లతో కూడిన స్టాళ్లు రెండు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాసుపత్రి వద్ద ఒకటి, సొసైటీ రోడ్డులోని బాలగంగాధర్‌ తిలక్‌ ఆడిటోరియం వద్ద రెండోది ఏర్పాటు చేశారు.

చాలా శుభకార్యాలలో, పార్టీల్లో, హోటళ్లలో, ఇళ్లలో ఆహార పదార్థాలు కావాల్సిన దానికి మించి తయారు చేస్తుంటారు. మిగిలిపోయినవి ఏం చేయాలో తెలియక అలాగే ఉంచి పాడయ్యాక పడేస్తుంటారు. వీటిని పేదలెవరికైనా అందించాలన్న ఔదార్యమున్న వారూ వీటిని వినియోగించుకోవచ్ఛు గుప్పెడంత అన్నం పడేయాలనుకున్నా.. మేం గుర్తుకురావాలి అంటున్నారు నీలామా ఆర్య. ‘ప్రతి స్టాల్‌ వద్ద వేతనం ఇచ్చి ముగ్గురు చొప్పున ఉద్యోగులను ఉంచుతున్నాం. స్థలం, విద్యుత్తు స్థానిక మున్సిపాలిటీలిస్తాయి. స్వచ్ఛందంగా ముందుకొచ్చేవారు, సంస్థల సహాయం తీసుకుంటాం. తణుకులో పట్టాభి ఫౌండేషన్‌ సాయంతో ఒకటి, ఎమ్మెల్యే కారుమూరి సాయంతో మరోటి ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి నియోజకవర్గంలో రెండు చొప్పున 350 రిఫ్రిజిరేటర్లు ఏర్పాటు చేయాలన్నదే మా లక్ష్యం’ అని వివరించారు. ‘2018లో తమ సంస్థను ప్రారంభించామన్నారు.

 వృద్ధుడికి ఆహారం అందిస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని