logo

గ్రంథాలయాల అభివృద్ధికి కృషి

గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చీర్ల పద్మశ్రీ అన్నారు. ఆమె అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. అజెండాలో ప్రవేశపెట్టిన పలు అంశాలను చర్చించి ఆమోదించారు.

Published : 23 Jan 2022 03:53 IST

సమావేశంలో ఛైర్మన్‌ పద్మశ్రీ, తదితరులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: గ్రంథాలయాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ చీర్ల పద్మశ్రీ అన్నారు. ఆమె అధ్యక్షతన జిల్లా గ్రంథాలయ సంస్థ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. అజెండాలో ప్రవేశపెట్టిన పలు అంశాలను చర్చించి ఆమోదించారు. రూ.250 లక్షలతో కంప్యూటర్లు కొనుగోలుకు పరిపాలన ఆమోదం, రూ. 1.40 కోట్ల్లతో పుస్తకాల కొనుగోలు, 33 శాఖా గ్రంథాలయాల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించడం, రూ.లక్షతో కంప్యూటర్లు మరమ్మతులు చేసేందుకు ఆమోదించారు.  ఉద్యోగులకు శిక్షణతరగతుల నిర్వహణ, వేల్పూరు, ఇరగవరం, నిడమర్రు, పిప్పర, మొగల్తూరు, ఆరవల్లి, తాళ్లపూడి, పోలవరం గ్రంథాలయాల్లో మరుగుదొడ్ల నిర్మాణం, భీమడోలు, తణుకు గ్రంథాలయాలకు నూతన భవనాల నిర్మాణం కోసం అంచనాలు రూపొందించేందుకు ఆమోదించారు.  కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి డి.రవికుమార్, డీఎల్పీవో బాలు, వయోజన విద్య ఏపీవో ఆర్‌. విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని