logo

దొంగల అరెస్టు

తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవిప్రకాశ్‌ వివరాలను వెల్లడించారు.

Published : 28 May 2022 04:47 IST

భారీగా బంగారం, నగదు స్వాధీనం

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రవిప్రకాశ్‌

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: తాడేపల్లిగూడెం మండలంలోని పలు గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పట్టణ పోలీసుస్టేషన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రవిప్రకాశ్‌ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా క్రోసూరుకు చెందిన పిండ్రాల రాంబాబు, వెంకన్న పాత నేరస్థులని, గతంలో వీరు జైలు శిక్ష అనుభవించారన్నారు. తాడేపల్లిగూడెం గ్రామీణ, పట్టణ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వీరిపై 13 కేసులు నమోదయ్యాయన్నారు. వీరు ఇటీవల గూడెం మండలంలోని మాధవరం, దండగర్ర, వెంకట్రావుపాలెం, కృష్ణాపురం, చినతాడేపల్లి గ్రామాల్లోని ఇళ్లలో రాత్రివేళ దొంగతనాలకు పాల్పడి భారీగా నగదు, బంగారు ఆభరణాలు దోచుకున్నారని తెలిపారు. వరుస ఘటనలపై నిఘా పెట్టిన గ్రామీణ పోలీసులు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారన్నారు. ఇద్దరి వద్ద నుంచి 41 కాసుల బంగారం, రూ.2.40 లక్షల నగదు, దొంగతనాలకు వాడిన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో మోటారుసైకిళ్ల అపహరణకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి, వారి నుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో సీఐ నాగరాజు, ఎస్సైలు శ్రీనివాస్‌, రాజు, జీజే ప్రసాద్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని