logo

ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన వైద్యుల సస్పెన్షన్‌

విధుల్లో ఉండగానే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేసిన ఇద్దరు ప్రభుత్వ వైద్యులను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ చక్రధరరావు, మత్తు వైద్యుడు రాకేష్‌ సస్పెన్షన్‌కు గురైనట్లు డీసీహెచ్‌ఎస్‌

Updated : 29 Jun 2022 05:51 IST

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: విధుల్లో ఉండగానే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి శస్త్రచికిత్స చేసిన ఇద్దరు ప్రభుత్వ వైద్యులను జిల్లా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రి సివిల్‌ సర్జన్‌ చక్రధరరావు, మత్తు వైద్యుడు రాకేష్‌ సస్పెన్షన్‌కు గురైనట్లు డీసీహెచ్‌ఎస్‌ శ్రీనివాసరావు తెలిపారు. గత మే 28న గిరిజన విద్యార్థిని మొడియం మంగ జంగారెడ్డిగూడెంలోని చిరంజీవి ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందారు. ఆమెకు జరిగిన శస్త్ర చికిత్సలో ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. విద్యార్థిని మృతిపై తల్లిదండ్రులు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌, వైద్య నిపుణులు విచారణ చేశారు. ఇందులో భాగంగానే ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులపై చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని