logo

పరిశోధనల్లో నవ ఉషస్సులు

ఉద్యాన రంగంలో శాస్త్రవేత్తలుగా ప్రత్యేకత చాటుతున్నారు తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు యువ శాస్త్రవేత్తలు. పరిశోధనలతో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఉద్యానరంగంలో చేస్తున్న నూతన ప్రయోగాల నేపథ్యంలో ఇటీవలే పలు అవార్డులు దక్కాయి. జా

Published : 30 Jun 2022 04:53 IST

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే

ఉద్యాన రంగంలో శాస్త్రవేత్తలుగా ప్రత్యేకత చాటుతున్నారు తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు యువ శాస్త్రవేత్తలు. పరిశోధనలతో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఉద్యానరంగంలో చేస్తున్న నూతన ప్రయోగాల నేపథ్యంలో ఇటీవలే పలు అవార్డులు దక్కాయి. జాతీయ స్థాయిలో ప్రయోగ పత్రాలు, పుస్తకాలు రచించి విశ్వవిద్యాలయ ఖ్యాతిని ఇనుమడింపజేశారు.

మామిడిపై..

ఉద్యాన పరిశోధనా స్థానం యువ శాస్త్రవేత్తగా బాధ్యతలు చేపట్టారు డా.డి.శ్రీధర్‌. బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ, మామిడి పంటలలో ఎన్నోపరిశోధనలు చేశారు.మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డవలప్‌మెంట్‌ ఆఫ్‌ హర్టీకల్చర్‌ ద్వారా పసుపు పంటలో ఉత్తమ పరిశోధనా విత్తనాలను ఉత్పత్తి చేయడంలో భాగస్వాములయ్యారు. ప్రధానంగా బొప్పాయిలో ఈయన రచించిన ప్లాంట్‌ ఎలిసిటర్స్‌ ప్రభావంపై గుజరాత్‌లో నవసారీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన హర్టీకల్చర్‌ సదస్సులో ఉత్తమ పరిశోధనా పత్రంగా ఎంపికైంది. దీంతో రెండు నెలల కిందటే ఉత్తమ పరిశోధకునిగా అవార్డును అందుకున్నారు. వీటితోపాటు వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో యువ ఉద్యాన శాస్త్రవేత్తల బృందంతోపలు పరిశోధనల్లో భాగస్వాములయ్యాయి.

దానిమ్మ సాగుపై..

విశ్వవిద్యాలయ అనుబంధంగా ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తగా డా.ఫిరోజ్‌హుస్సేన్‌ పని చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఉద్యాన శాస్త్రవేత్తగా తన ప్రస్థానం ప్రారంభించారు. తక్కువ వయసులో దానిమ్మ సాగులో పి.హెచ్‌.డి. విద్యార్థిగా ఎన్నో ప్రయోగాలు చేశారు. పలు అంశాల్లో గుర్తింపు పొందారు. ఉత్తమ పి.హెచ్‌.డి అవార్డును ప్రదానం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న నన్సారీ యూనివర్శిటీలో అందుకున్నారు. విద్యార్థి దశలోనే 15 పరిశోధనా పత్రాలను, ఉద్యాన రంగంలో దానిమ్మసాగుపై ఏడు తెలుగు వ్యాసాలను రచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని