logo

విద్యుదాఘాతంతో రైతు మృతి

మొక్కజొన్న విత్తనాలు జల్లే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి ఓ రైతు మృతి చెందిన వైనమిది.

Published : 02 Dec 2022 05:53 IST

పోలవరం, న్యూస్‌టుడే: మొక్కజొన్న విత్తనాలు జల్లే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి ఓ రైతు మృతి చెందిన వైనమిది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం మండలం బంగారమ్మపేట గ్రామానికి చెందిన రైతు పొరిపిరెడ్డి రమేశ్‌ (56) గురువారం తెల్లవారుజామున కొత్తపట్టిసీమ గ్రామంలోని మరో రైతు పొలంలో విత్తనాలు వేసేందుకు వెళ్లాడు. ఇనుప గొర్రుతో విత్తనాలు వేసి తిరిగి దానిని భుజంపై పెట్టుకునేందుకు పైకి ఎత్తడంతో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. 108 వాహనం అక్కడకు చేరుకునేలోపు అతను మరణించారు. మృతుడి భార్య పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని