logo

త్రుటిలో తప్పిన ప్రమాదం

జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలోని  దేవరపల్లి-తల్లాడ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ,వ్యాను ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఓ వాహన చోదకుడిని గాయాలయ్యాయి.

Published : 02 Dec 2022 06:03 IST

లారీ, వ్యాన్‌ ఢీ
వాహనచోదకుడికి గాయాలు

జంగారెడ్డిగూడెం క్రైం: జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలోని  దేవరపల్లి-తల్లాడ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ,వ్యాను ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో ఓ వాహన చోదకుడిని గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం...  విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు కొబ్బరికాయలు లోడుతో వెళుతున్న డీసీఎం వ్యాన్‌ను ..కొత్తగూడెం నుంచి దేవరపల్లి కి మొక్కజొన్న లోడుతో వెళుతున్న లారీ బలంగా ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి దూసుకెళ్లింది. ప్రమాదం కారణంగా లారీలో ఇరుక్కున్న చోదకుడు ఉప్పలపాటి పవన్ (26) ను స్థానికులు బయటకు తీశారు. పవన్ కు కాలు విరగడంతో 108 సిబ్బంది చికిత్స అందించి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. లారీ,వ్యానును ఓ పక్కగా ఢీ కొనడంతో వ్యానులోని వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని