logo

అంతర్వేది క్షేత్రంలో దివ్య పరిణయ వైభోగం

సాగర సంగమ కెరటాల వేద హోరులో అంతర్వేదిలోని పవిత్ర ధామం దేదీప్యమానంగా శోభిల్లింది. నమో నారసింహా అంటూ భక్తజన సందోహం నుంచి వెల్లువెత్తిన దివ్య నామస్మరణలు మిన్నంటాయి.

Updated : 01 Feb 2023 05:31 IST

వేద పండితుల ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు

న్యూస్‌టుడే, అంతర్వేది, మామిడికుదురు, రాజోలు: సాగర సంగమ కెరటాల వేద హోరులో అంతర్వేదిలోని పవిత్ర ధామం దేదీప్యమానంగా శోభిల్లింది. నమో నారసింహా అంటూ భక్తజన సందోహం నుంచి వెల్లువెత్తిన దివ్య నామస్మరణలు మిన్నంటాయి. మంగళవారం రాత్రి 12.46కు శ్రీదేవి, భూదేవితో నారసింహస్వామివారికి కల్యాణ క్రతువు ఆద్యంతం వైభవంగా సాగింది. అంతకుముందు సాయంత్రం పంచముఖాంజనేయస్వామి, కంచు గరుడ వాహన సేవలు పూర్తయ్యాక ఎదుర్కోలు సన్నాహం జరిగింది. స్వర్ణాభరణాలు అలంకరించిన ఉత్సవ మూర్తులను రాత్రి 10.29 గంటలకు భారీ బందోబస్తు నడుమ ప్రధాన ఆలయం నుంచి జయజయధ్వానాల మధ్య తీసుకొచ్చి పరిమళభరిత పుష్పాలతో అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు. ముహూర్త సమయంలో స్వామి, ఉభయ దేవేరుల శిరస్సులపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. మాంగల్యధారణ రమణీయంగా జరిగింది. ఆద్యంతం తలంబ్రాల ఘట్టం భక్తులను పులకింపజేసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భీష్మ ఏకాదశి పర్వదినాన స్వామివారి దివ్య ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి భక్తజన సంద్రంలో వైభవంగా ఊరేగించనున్నారు.

హనుమంత వాహనంపై స్వామివారు


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని