logo

బాలలను ప్రోత్సహిస్తే ప్రతిభకు వెలుగు

 బాలబాలికల్లో ఏదో ఒక ప్రతిభ దాగుంటుందని, వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తే ప్రతిభావంతులు అవుతారని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు.

Published : 05 Feb 2023 03:28 IST

ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ

వివిధ రకాల వస్తువుల తయారీలో బాలలు 

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే:  బాలబాలికల్లో ఏదో ఒక ప్రతిభ దాగుంటుందని, వారిని తగిన విధంగా ప్రోత్సహిస్తే ప్రతిభావంతులు అవుతారని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. హేలాపురి బాలోత్సవం స్థానిక సీఆర్‌ఆర్‌ పాఠశాలలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన సాబ్జీ మాట్లాడుతూ నేటి కంప్యూటర్‌ యుగంలో ఆటపాటలు, విజ్ఞానదాయక కార్యక్రమాలు కనుమరుగై బాలలు యాంత్రికంగా తయారవుతున్నారన్నారు. చదువు, మార్కులే ప్రాతిపదికగా కాకుండా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో వారిని  భాగస్వాములను చేస్తే వారిలో మానసిక పరిపక్వత ఏర్పడుతుందని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయని, ఇలాంటి బాలోత్సవాలు మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. ఇన్‌ఛార్జి డీఈవో ఎంవీ అవధాని మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠ్యాంశాలతోపాటు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవాలని సూచించారు. సీఆర్‌ఆర్‌ విద్యా సంస్థల కార్యదర్శి ఎంబీఎస్‌వీ ప్రసాద్‌ మాట్లాడుతూ బాలోత్సవం నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయవచ్చన్నారు. కార్యక్రమంలో సీఆర్‌ఆర్‌ పాఠశాల కరస్పాండెంట్‌ రఘుకుమార్‌, దీపక్‌ నెక్స్‌జెన్‌ సంస్థ అధినేత ఎ.సుబ్రహ్మణ్యం, మానవత సంస్థ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.గంగాధర్‌, బాలోత్సవ ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆలపాటి నాగేశ్వరరావు, ఎల్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. జానపదం, కోలాటం, శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలు, లఘు నాటికలు, ఏకపాత్రాభినయం తదితర అంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఆదివారం కూడా బాలోత్సవం కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని