logo

జనసమీకరణకు వైకాపా అగచాట్లు

ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం

Published : 25 Apr 2024 06:06 IST

నామినేషన్‌ ర్యాలీకి రావాలంటూ ఒత్తిళ్లు

ఈనాడు, ఏలూరు: ఎన్నికలు సమీపించే కొద్దీ వైకాపా నాయకుల దిగజారుడు వ్యవహారాలు పరాకాష్ఠకు చేరుకుంటున్నాయి. ప్రచారాలు, నామినేషన్లలో బలం చూపించేందుకు ప్రజలను ప్రలోభాలు పెట్టి..పథకాల పేరుతో భయపెట్టి తరలిస్తున్నారు. ఇందుకు వాలంటీర్లు, వైకేపీ సిబ్బందిని ఆయుధాలుగా వినియోగిస్తున్నారు. ఇష్టం లేకున్నా నిజంగా పథకాలు పోతాయన్న భయంతో జనాలు వెళ్లాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు.

ఉంగుటూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు గురువారం నామిషనేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీగా వెళ్లేందుకు భారీగా జన సమీకరణ చేసేందుకు వైకాపా నేతలు కొత్త ఎత్తు వేశారు. పెదనిండ్రకొలను, నిడమర్రు, భువనపల్లి, చానమిల్లి, క్రొవ్విడి, అడవి కొలను, బావాయిపాలెం ఇలా నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో వీవోఏలను మహిళలను ర్యాలీకి తీసుకురావాలని వైకాపా నాయకులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ‘జనాలను తరలించేందుకు నాయకులు తిరగాలి.. ప్రచారంతో సంబంధం లేని మమ్మల్ని చంపేస్తున్నారు. ఆడవాళ్లమని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు’ అంటూ నిస్సహాయ స్థితిలో ఓ యానిమేటర్‌ చరవాణిలో మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఉపాధి కూలీలను సైతం తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ర్యాలీలో పాల్గొన్న వారు పని చేయకపోయినా హాజరు, కూలి డబ్బులు వచ్చేలా చేస్తామని నాయకులు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం పోలవరం వైకాపా అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి నిర్వహించిన ర్యాలీలో సైతం ఉపాధి హామీ కూలీలను భారీగా తరలించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు