logo

అనర్హులు ఎవరెవరు

రెండు వందల యూనిట్ల వరకు రాయితీ విద్యుత్తు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారుల్లో అనర్హులను గుర్తించేందుకు యంత్రాంగం ఆరా తీస్తోంది. లబ్ధిదారులు కొందరు బయట ఉంటూ స్వగ్రామాల్లో

Published : 20 May 2022 06:03 IST

రాయితీ విద్యుత్తు లబ్ధిదారులపై ఆరా

భీమవరం వన్‌టౌన్, న్యూస్‌టుడే: రెండు వందల యూనిట్ల వరకు రాయితీ విద్యుత్తు పొందుతున్న ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్తు వినియోగదారుల్లో అనర్హులను గుర్తించేందుకు యంత్రాంగం ఆరా తీస్తోంది. లబ్ధిదారులు కొందరు బయట ఉంటూ స్వగ్రామాల్లో సొంత ఇళ్లను అద్దెలకు ఇచ్చి వాటికి కూడా రాయితీ పొందుతున్నారని, మరికొందరు దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నవారు, ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులు పథకం లబ్ధిని పొందుతున్నారన్న సమాచారంతో వివరాలు సేకరిస్తున్నారు. లబ్ధిదారుల ఆధార్‌  నంబర్లను విద్యుత్తు కనెక్షన్లకు అనుసంధానమై ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు.  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15.27 లక్షలకు పైగా గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు 1.60 లక్షల మంది ఉన్నారు. కుల ధ్రువపత్రాలు సమర్పించిన వినియోగదారులందరికీ రాయితీ విద్యుత్తు సరఫరా చేశారు. ‘ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులు ఎక్కడున్నా రాయితీ విద్యుత్తు అందిస్తాం. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,200 మంది అనర్హులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. ఆ మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం. 200 యూనిట్ల రాయితీ విద్యుత్తులో కోత విధించడం అనేది అసత్యం’ అని ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్యాంబాబు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని