logo

రేపటి నుంచి రంజాన్‌ మాసం ప్రారంభం

ఈ నెల 22వ తేదీ బుధవారం నెలవంక కనిపించకపోవడంతో ఈనెల 24వ తేదీ శుక్రవారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతుందని ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌ షా గౌస్‌పీరా ఖాద్రి తెలిపారు.

Published : 23 Mar 2023 04:49 IST

జమ్మలమడుగులోని పలగాడివీధి మసీదు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: ఈ నెల 22వ తేదీ బుధవారం నెలవంక కనిపించకపోవడంతో ఈనెల 24వ తేదీ శుక్రవారం నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతుందని ఆస్థాన ఏ గౌసియా పీఠాధిపతి, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌ షా గౌస్‌పీరా ఖాద్రి తెలిపారు. ప్రత్యేక నమాజు తరావీ ప్రార్థనలు గురువారం రాత్రి ప్రారంభమవుతాయని, శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు మొదలవుతాయని తెలిపారు. తెల్లవారు జామున 4.50 గంటలకు సహరి పూర్తి చేయాలని, సాయంత్రం 6.33 గంటల అనంతరం ఉపవాస దీక్షలు విరమించాల్సిన సమయంగా తెలిపారు. ఉపవాస దీక్షలు ఉన్నవారికి స్థానిక పలగాడి మసీదులో వేకువజామున సహరీ ఏర్పాట్లు చేస్తామన్నారు. వేకువజామున 3.30 గంటల నుంచి 4.30 వరకు విచ్చేసి ఆహారం తీసుకోవచ్చునన్నారు. పలగాడి మసీదుతోపాటు పట్టణంలోని పలు కమిటీ సభ్యులు నెల రోజులపాటు సహరీతోపాటు ఇఫ్తార్‌ (రాత్రి భోజన) ఏర్పాట్లు చేస్తున్నారు. ్య సౌదీ అరేబియాలో రంజాన్‌ మాసం ముందే ప్రారంభమవుతుంది. బుధవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో అక్కడ మన దేశం కంటే ఒక రోజు ముందే రంజాన్‌ మాసం ప్రారంభం కానుంది. గురువారం నుంచే అక్కడ ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని మతపెద్దలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని